మృణాల్‌ ఠాకూర్‌కి ఆ ఛాన్స్ అప్పుడు మిస్ అయ్యింది కానీ.!

- September 18, 2024 , by Maagulf
మృణాల్‌ ఠాకూర్‌కి ఆ ఛాన్స్ అప్పుడు మిస్ అయ్యింది కానీ.!

‘సీతారామం’ సినిమాతో హిట్టు హీరోయిన్ అయిపోయింది అందాల భామ మృణాల్ ఠాకూర్. నిజానికి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. కానీ, కాలం కలిసి రాక అక్కడ నిలదొక్కుకోలేకపోయింది.

‘సీతారామం’ రూపంలో కెరీర్‌లో చాన్నాళ్లకి హిట్టు కొట్టింది. టాలీవుడ్‌కి లక్కీ బ్యూటీ అయిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే, ‘సీతారామం’ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రబాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఫౌజీ’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట మృణాల్ పేరే వినిపించినా కొత్త భామ ఇమాన్వి ఇస్మాయెల్ ఫిక్స్ అయ్యింది.

అలా ప్రబాస్‌తో మృణాల్ నటించే ఛాన్స్ కోల్పోయింది. కానీ, ఆ ఛాన్స్ ఇంకా పోలేదనీ, ఆ సినిమా పోతేనేం! ఇంకో సినిమా మృణాల్ కోసం ఎదురు చూస్తోందనీ తాజా సమాచారం.

అదే సందీప్ రెడ్డి వంగా మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్‌గా మృణాల్‌ని ఎంచుకోబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ అదే జరిగితే, మృణాల్‌కి మళ్లీ మహర్దశ పట్టినట్లే. ప్రబాస్ సినిమా అంటే ఆ లెక్కే వేరు. సో, బాలీవుడ్‌ ప్రేక్షకులకి మృణాల్ దగ్గరయ్యే ఛాన్సుంది ఈ సినిమాతో. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com