‘ఓ పిల్లో..’ అంటూ మీనాక్షి వెంట పడుతున్న ‘మెకానిక్ రాఖీ’.!

- September 18, 2024 , by Maagulf
‘ఓ పిల్లో..’ అంటూ మీనాక్షి వెంట పడుతున్న ‘మెకానిక్ రాఖీ’.!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా ‘మెకానిక్ రాఖీ’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కుర్ర హీరో ‘మెకానిక్ రాఖీ’ అంటూ అందాల భామ మీనాక్షి చౌదరి‌తో ఆన్ స్క్కీన్ రొమాన్స్‌కి దిగుతున్నాడు.

ఈ సినిమాని రవితేజ ఎమ్ తెరకెక్కిస్తుండగా, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్‌లో మీనాక్షి కోసం విశ్వక్ సేన్ ఓ రొమాంటిక్ సాంగ్ అందుకున్నాడు. అదే ‘ఓ పిల్లో..’. విశ్వక్ సేన్‌కి ఈ తరహా సాంగ్స్ చేయడంలో మంచి టేస్ట్ వుంది. గతంలో ‘పాగల్’ తదితర చిత్రాల్లో ఈ తరహా సాంగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయ్.

ఇప్పుడీ సాంగ్ కూడా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసేలానే అనిపిస్తోంది. అన్నింటికీ మించి, ఈ పాటకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించడం మరో ప్లస్ పాయింట్ కానుంది.

‘సరిపోదా శనివారం’ సినిమాతో జేక్స్ బిజోయ్ పేరు బాగా పాపులర్ అయిపోయింది. మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆ సినిమాకి. ఆయనే ఇప్పుడు విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాఖీ’కీ బిజీఎమ్ ఇస్తున్నాడు. సో, మనోడికి అదృష్టం వరించేలానే వుంది ‘మెకానిక్ రాఖీ’తో. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com