సగం ధరకే పెట్రోల్-టు-ఎలక్ట్రిక్ కార్లు.. దుబాయ్ కంపెనీ బంపరాఫర్..!!

- September 18, 2024 , by Maagulf
సగం ధరకే పెట్రోల్-టు-ఎలక్ట్రిక్ కార్లు.. దుబాయ్ కంపెనీ బంపరాఫర్..!!

యూఏఈ: Dh70,000 నుండి ప్రారంభ ధరతో దుబాయ్‌కి చెందిన స్టార్టప్ కంపెనీ.. కొత్తగా తయారు చేసిన EVల కంటే 50 శాతం తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) ఆఫర్ చేస్తోంది. 2025 త్రైమాసికం నుండి డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దుబాయ్ వరల్డ్‌లో జరుగుతున్న ఐదు రోజుల ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (ITS) వరల్డ్ కాంగ్రెస్ మరియు ఎగ్జిబిషన్‌లో పెట్రోల్ ఆధారిత టయోటా క్యామ్రీగా ఉండే EV సెడాన్ మోడల్ ను ప్రదర్శించారు.   "మేము కొంతకాలంగా ReCar అభివృద్ధి చేస్తున్నాము. Q2 2025లో డెలివరీ చేయబడే ఆర్డర్‌లతో మేము ఉత్పత్తి చేయనున్నాం.  ఇది భవిష్యత్తులో ఒక పెద్ద అడుగు.,” అని పీక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు యూఏఈలో జన్మించిన జాక్ ఫైజల్ పేర్కొన్నారు.  గత ఏడాది డిసెంబరులో దుబాయ్‌లో జరిగిన COP28 సందర్భంగా స్వదేశీ-పెట్రోల్-టు-ఎలక్ట్రిక్ రీపర్పస్డ్ వాహనాన్ని మొదటిసారిగా పరిచయం చేశారు.

ReCar అనేది పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే వాహనం నుండి తయారు చేశారు. ఇది కొత్తగా తయారు చేయబడిన EV కంటే చౌకైనది. రిటైర్డ్ పెట్రోల్ వాహనాలను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతారు. ఇది కొత్త వెర్షన్ల కంటే తయారీ వ్యయంలో 30 శాతం తగ్గింపు, తయారీ సమయం 80 శాతం తక్కువగా ఉంటుంది. బ్యాటరీ EV ప్రధాన లైఫ్‌లైన్.  పీక్ మొబిలిటీ తమ రీకార్ ఫుల్-ఛార్జ్‌పై 300కిమీల వరకు నడుస్తుందని తెలిపింది. ReCarతో "కొత్త కారు" అనుభూతి కూడా ఉంది.  HMI లేదా హ్యూమన్ మెషిన్ ఇంటర్‌ఫేస్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఇది కలిగుందని కంపెనీ తెలిపింది. దుబాయ్ ఎలక్ట్రిసిటీ & వాటర్ అథారిటీ (DEWA) ప్రకారం.. నగరం అంతటా EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఉపయోగించే రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య ఆధారంగా దుబాయ్‌లో EVల సంఖ్య ఏప్రిల్ 2024 నాటికి 30,000 యూనిట్లకు చేరుకుందని అంచనా.  2050 నాటికి రోడ్లపై ఉన్న అన్ని వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాను 50 శాతానికి పెంచడమే లక్ష్యామని యూఏఈ ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com