పాలస్తీనా సంక్షోభం..అంతర్జాతీయ సమాజానికి ఖతార్ పిలుపు..!
- September 18, 2024
జెనీవా: పాలస్తీనా ప్రజలకు ఖతార్ తన మద్దతును తెలియజేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి, పాలస్తీనా లో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖతార్ పిలుపునిచ్చింది.
యునైటెడ్ నేషన్స్ 71వ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో సమావేశం సందర్భంగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని ఖతార్ శాశ్వత ప్రతినిధి డాక్టర్ హింద్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ముఫ్తా ఈ మేరకు కోరింది. అదే సమయంలో పాలస్తీనా ఆర్థిక వ్యవస్థపై ఇజ్రాయెల్ ఆక్రమణ ప్రభావాన్ని తగ్గించడంలో UNCTAD పోషించిన కీలక పాత్రను ప్రశంసించారు. పాలస్తీనా ప్రజలకు మానవతావాద, అభివృద్ధికి మద్దతును కొనసాగిస్తానని ఖతార్ స్పష్టం చేసింది. గాజాలోని ప్రజలకుకు ఆహారం, అత్యవసర ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయాన్ని అందించడానికి ఖతార్ ఛారిటీ నియర్ ఈస్ట్‌లోని పాలస్తీనా శరణార్థుల కోసం UN రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)తో ఆగస్టులో $3 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసిందని హర్ ఎక్సలెన్సీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- సాహితీ లోకం ఆత్మీయురాలు సుధ ను కోల్పోయింది: నటుడు రాజేంద్ర ప్రసాద్
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్‌ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన







