సెప్టెంబర్ 26న రియాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం..!!
- September 18, 2024
రియాద్: రియాద్‌లోని కింగ్ సౌద్ యూనివర్శిటీలో సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2024ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది 800 పెవిలియన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెయిర్‌లో 30 కంటే ఎక్కువ దేశాల నుండి 2,000 కంటే ఎక్కువ స్థానిక, అరబ్ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు, ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. అరబ్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలలో ఒకటిగా రియాద్ బుక్ ఫెయిర్ స్థానం సంపాదించింది. ఖతార్ ఈ సంవత్సరం బుక్ ఫెయిర్‌లో గౌరవ అతిథిగా హోదాలో ఉంటుందని, ఐదు దశాబ్దాలుగా రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కొనసాగుతుందని కమిషన్ సీఈఓ డాక్టర్ ముహమ్మద్ అల్వాన్ తెలిపారు. బుక్ ఫెయిర్ తన సందర్శకులకు, సంస్కృతి పుస్తకాలను ఇష్టపడే వారికి, ఒక వినూత్నమైన సాంస్కృతిక ప్రయాణాన్ని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..