వాణిజ్య రిజిస్ట్రేషన్ చట్టాలకు సౌదీ క్యాబినెట్ ఆమోదం..!

- September 19, 2024 , by Maagulf
వాణిజ్య రిజిస్ట్రేషన్ చట్టాలకు సౌదీ క్యాబినెట్ ఆమోదం..!

రియాద్: రియాద్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన సౌదీ క్యాబినెట్ సెషన్.. వాణిజ్య నమోదు చట్టం, వాణిజ్య పేర్ల చట్టానికి ఆమోదం తెలిపింది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ లావాదేవీల పన్ను చట్టాన్ని కూడా ఆమోదించారు.  ఈ మేరకు మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ తెలిపారు. ఇటీవల రియాద్‌లో చైనా సమక్షంలో జరిగిన సౌదీ-చైనీస్ హై-లెవల్ కమిటీ నాల్గవ సెషన్ ఫలితాలను క్యాబినెట్ అభినందించింది. ఇది రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, రాజకీయ, భద్రత, సైనిక, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక వంటి అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో ఇరు దేశాల ఆసక్తిని ప్రతిబింబిస్తుందని చెప్పారు.  ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని సాధించేందుకు  వివిధ మార్గాల ద్వారా ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు,  సంస్థలతో సహకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను క్యాబినెట్ చర్చించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడం, పాలస్తీనా ప్రజల బాధలను తగ్గించడానికి మానవతా సహాయాన్ని అందించడానికి కృషి చేయడం వంటి చర్యలను కౌన్సిల్ స్వాగతించింది. గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం రేట్1.6 శాతం, వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో చమురుయేతర కార్యకలాపాల వార్షిక వృద్ధి 4.9 శాతంతో సహా జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అత్యంత ప్రముఖ గణాంకాలను క్యాబినెట్ సమీక్షించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com