భాగ్యనగరంలో తమ కార్యక్రమాలను ప్రారంభించిన పిఎన్ రావు

- September 19, 2024 , by Maagulf
భాగ్యనగరంలో తమ కార్యక్రమాలను ప్రారంభించిన పిఎన్ రావు

హైదరాబాద్: హైదరాబాద్, బెంగళూరుకు చెందిన 100 ఏళ్ల చరిత్ర మరియు వారసత్వం కలిగిన ఫ్యాషన్ బ్రాండ్, దేశంలోనే అత్యుత్తమ పురుషుల సూట్ మేకర్ పిఎన్ రావు, తెలంగాణలోని అత్యున్నత ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఈరోజు ప్రారంభించింది. సుసంపన్నమైన జూబ్లీ హిల్స్‌ లో ఉన్న ఈ పిఎన్ రావు స్టోర్ దక్షిణ భారతదేశంలో సంస్థకు 8వ స్టోర్ కాగా ఈ ప్రాంతం అంతటా దాని కార్యకలాపాలను విస్తరించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ స్టోర్‌ను మచ్చేందర్ పిషి, పార్టనర్ పిఎన్ రావు, సంస్థ రెండవ తరం వ్యాపారవేత్త కేతన్ పిషి, పార్టనర్, పిఎన్ రావు మరియు మూడవ తరం వ్యాపారవేత్త నవీన్ పిషి, పార్టనర్, పిఎన్ రావు ప్రారంభించారు.

పిఎన్ రావు భాగస్వామి, కేతన్ పిషి మాట్లాడుతూ, “ తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న యువత మరియు నాణ్యత పట్ల అత్యున్నత స్పృహ కలిగిన జనాభాతో శక్తివంతమైన, ఫ్యాషన్ స్పృహ కలిగిన నగరం హైదరాబాద్.ఈ నగరానికి పిఎన్ రావు వంటి స్టోర్ అవసరం. మేము హైదరాబాద్ మరియు తెలంగాణ జనాభా అవసరాలను తీర్చడానికి సరైన సమయంలో స్టోర్ ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము.దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే పురుషుల సూట్ బ్రాండ్‌గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని పిఎన్ రావు ఏర్పరచుకుంది.హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించటంతో, నగరంలో తన ఉనికిని చాటుకోవడానికి పిఎన్ రావు సిద్ధంగా ఉంది, నాణ్యతను కోరుకునే ప్రజల అవసరాలను తీర్చటం తో పాటుగా త్వరలో వారికి ఇష్టమైనదిగా ఉద్భవించనుంది. నగరంలోకి పిఎన్ రావు ప్రవేశం సమయానుకూలంగా ఉండటంతో పాటుగా మరియు వ్యూహాత్మకమైనది, ఇది రెడీ టు వేర్ వస్త్రాలు మరియు అసాధారణమైన నాణ్యతతో చక్కదనంను సజావుగా మిళితం చేసే క్లాసిక్ బెస్పోక్ టైలరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చనుంది” అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com