పోలీసుల అదుపులో జానీ మాస్టర్..
- September 19, 2024
బెంగుళూరు: పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం. కాగా, తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర పని చేసే మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే మతం మార్చుకొని పెళ్లి చేసుకోమ్మని బలవంతం చేసాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు చర్చగా మరింది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన దగ్గర్నుంచి జానీ మాస్టర్ కనపడట్లేదు. తాజాగా నేడు జానీ మాస్టర్ ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..