అల్ ముగ్సేల్ రోడ్ ప్రాజెక్ట్.. కుదిరిన OMR9 మిలియన్ల ఒప్పందం..!!
- September 19, 2024
మస్కట్: రవాణా, కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అల్ ముగ్‌సైల్ రోడ్ మరియు బ్రిడ్జ్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని మొత్తం వ్యయం OMR 9 మిలియన్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంపై రవాణా, కమ్యూనికేషన్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ సైద్ బిన్ హమూద్ అల్ మావాలి సంతకం చేయగా, AZ ఇంజనీర్స్ నుండి ఇంజనీర్ సయ్యద్ అజర్ కంపెనీ తరపున రవాణా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సమక్షంలో సంతకం చేశారు.
ఈ ప్రాజెక్ట్‌లో 630 మీటర్ల పొడవు గల కాంక్రీట్ వంతెన నిర్మాణం ఉంటుంది. దీనికి 20 అబ్ట్‌మెంట్‌లు ఒక్కొక్కటి 13 మీటర్ల ఎత్తు ఉంటుంది., రెండు అతిపెద్ద ఆర్చీలు 45.9 మీటర్లకు, మిగిలిన ఆర్చ్‌లు 35.9 మీటర్ల వరకు ఉంటాయి. వంతెన రెండు వైపులా పార్కింగ్ ప్రాంతాలు, పాదచారుల నడక మార్గాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సలాలా నుండి ధోఫర్ గవర్నరేట్ (రఖ్యౌట్ మరియు ధాల్‌కుట్) పశ్చిమ జిల్లాలకు ట్రాఫిక్ ను సులువు చేయనుంది. రిపబ్లిక్ ఆఫ్ యెమెన్‌తో సరిహద్దు దాటడానికి అంతర్జాతీయ మార్గంగా కీలక రోల్ పోషించనుంది. ముఖ్యంగా మర్నీఫ్ గుహ, ముగ్‌సైల్ ఫౌంటైన్‌లు, ముగ్‌సైల్ బీచ్‌ఫ్రంట్‌లకు సమీపంలో ఉన్న కారణంగా వంతెన ప్రదేశం పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..