సంక్రాంతి రేసులోకి జోరుగా దూసుకొస్తున్న యంగ్ హీరో.!
- September 19, 2024
సందీప్ కిషన్ ఓ మంచి కాఫీలాంటి హీరో. కానీ, లక్కు కలిసి రావడం లేదు. ఏం చేసినా స్టార్డమ్ సంపాదించలేకపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేస్తున్నాడు.
రీసెంట్గా ధనుష్ హీరోగా వచ్చిన ‘రాయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా సందీప్ కిషన్ డైరెక్ట్ మూవీ సోదిలోకి వచ్చింది. అందుకు కారణం ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడమే.
నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో సందీప్ కిషన్ ఓ సినిమా చేస్తున్నాడు. హాస్య మూవీస్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
దర్శకుడు నక్కిన త్రినాధరావు, నాని వంటి హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో రాబోయే ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్‌కి మంచి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నారు.
అన్నట్లు ఈ సినిమాకి నాన్ దియేట్రికల్ బిజినెస్ ఊహించని విధంగా జరిగిందని ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం. అక్షరాలా 22 కోట్లుగా చెబుతున్నారు. అది సందీప్ కిషన్ కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్. సంక్రాంతి సీజన్లో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాకి పండగే పండగ. ఆ పండగ సందీప్ కెరీర్లోనూ వస్తుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజా వార్తలు
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- తెలంగాణ సమిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్
- ఏపీ: ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం







