అల్లు అర్జున్ ‘పుష్ప 2’.! ఇలాగైతే కష్టమేనేమో.!
- September 19, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఓ విపరీతమైన వలయాన్ని ఏర్పర్చేసుకుంటున్నాడు. మెగా కుటుంబం లేనిదే, అల్లు అర్జున్ లేడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, గత కొంత కాలంగా విత్ అవుట్ మెగా.. తనకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అల్లు అర్జున్.
అందుకు అనుగుణంగానే తన ఫ్యాన్స్‌ని అల్లు ఆర్మీ పేరుతో సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పొలిటికల్‌గానూ తన ఆర్మీని ఇన్‌వాల్వ్ చేస్తూ పావులు కదుపుతున్నాడు.
ఈ నేపథ్యంలో కొంచెం కాదు, కాదు ఎక్కువే నెగిటివిటీ మూట కట్టుకున్నాడు. ఇన్నాళ్లూ చిరంజీవి మొహం చూసి అల్లు అర్జున్‌ని క్షమిస్తూ వచ్చేశారు మెగా అభిమానులు. కానీ, ఈ సారి క్షమించేది లేదంటున్నారన్నది సోషల్ సమాచారం.
ఈ నెగిటివిటీ త్వరలో రాబోయే ‘పుష్ప 2’ సినిమాపై చాలా ప్రభావితం చూపించబోతోందనీ తెలుస్తోంది. అసలే ఇది అంచనాలున్న సినిమా. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. అలాంటిది ఈ సినిమాకి నెగిటివిటీ ఎఫెక్ట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- తెలంగాణ సమిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్
- ఏపీ: ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం







