గ్రీన్ రియాద్ ప్రోగ్రామ్.. ఘుధ్వానా ఉపనది పునరుద్ధరణ పూర్తి..!!

- September 22, 2024 , by Maagulf
గ్రీన్ రియాద్ ప్రోగ్రామ్.. ఘుధ్వానా ఉపనది పునరుద్ధరణ పూర్తి..!!

రియాద్:  34 నెలల కృషితో వాడి హనీఫా ముఖ్యమైన ఉపనది ఘుధ్వానా పర్యావరణ పునరుద్ధరణ పూర్తయినట్లు గ్రీన్ రియాద్ ప్రోగ్రామ్ అధికారులు వెల్లడించారు. నైరుతి రియాద్‌లోని ధహ్రత్ అల్ బదియా, అల్-సువైదీ, అల్-జహ్రా ప్రాంతాలను కలుపుతూ 5.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఒక అందమైన సహజ నదిని పునరుద్ధరించినట్టు తెలిపారు. 15,000కు పైగా చెట్లు, పొదలను నాటినట్టు వెల్లడించారు. స్థానిక కమ్యూనిటీల జీవితాలను, జీవనోపాధిని మెరుగుపరచడం, ఈ ప్రాంతంలో టూరిజాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సుస్థిర పర్యావరణ పద్ధతులు ప్రాజెక్ట్‌కు మార్గనిర్దేశం చేశాయని, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడానికి ప్రాజెక్ట్‌లో 65వేల చదరపు మీటర్ల సీటింగ్ ప్రాంతాలు, 13 పిల్లల ఆట స్థలాలు,  వివిధ క్రీడా సౌకర్యాలు, 700 కంటే ఎక్కువ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 22 కిలోమీటర్ల షేడెడ్ వాకింగ్ ట్రాక్ అన్ని సీజన్లలో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com