అమెరికాలో స్టేజి పై దేవిశ్రీ ప్రసాద్ ని హత్తుకున్న ప్రధాని మోదీ..
- September 23, 2024
అమెరికా: ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సు ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో అనేకమంది ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వగా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు.
అనంతరం దేవి శ్రీ ప్రసాద్, హనుమాన్కైంద్, ఆదిత్య గాధ్వి.. హర్ ఘర్ తిరంగా పాట పాడుతూ ప్రధాని మోదీకి స్టేజిపైకి ఆహ్వానం పలికారు. స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినందించారు. దేవితో పాటు స్టేజిపై ఉన్న మిగిలిన కళాకారులను కూడా దగ్గరకు తీసుకొని మోదీ అభినందించారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అమెరికాలో ప్రవాస భారతీయుల ఈవెంట్లో స్టేజిపై మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని ప్రధాని మోదీ అభినందించడం విశేషం.
ఈవెంట్ అయ్యాక కూడా మోదీ ప్రత్యేకంగా తనని అభినందించారు అని, షేక్ హ్యాండ్ ఇచ్చారని, ఆయనతో కలిసి సెల్ఫీ దిగాను అని, నాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది అని దేవి శ్రీ ప్రసాద్ అక్కడి మీడియాతో తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్