‘దేవర’ గురించి కార్తీ ఏమన్నాడంటే.!
- September 24, 2024
ఒక్క రోజు గ్యాప్‌లో ఎన్టీయార్ నటించిన ‘దేవర’, తమిళ హీరో కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయ్.
సెప్టెంబర్ 27న ‘దేవర’ ప్రేక్షకులు ముందుకు వస్తుండగా, తరువాతి రోజు అంటే సెప్టెంబర్ 28న ‘సత్యం సుందరం’ రిలీజ్ అవుతోంది.
తమిళంలో వేరే టైటిల్ వుండగా.. తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చమైన తెలుగు పేరును ఎంచుకున్నారు కార్తీ అండ్ టీమ్. అంతేకాదు, తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ వుంది.
సొంత మనిషిలాగా భావిస్తారు కార్తీని తెలుగు ప్రేక్షకులు. అందుకే అలాంటి తెలుగు అభిమానులు అస్సలు డిజప్పాయింట్ కాకుండా తన సినిమాలోని వివిధ తమిళ పేర్లు (ఉదాహరణకు ఓ ఊరు పేరు ఉద్ధండరాయుని పాలెం) సైతం తెలుగులో స్పష్టంగా డబ్బింగ్ చేసి చూపించినట్లు ప్రోమోల ద్వారా అర్ధమవుతోంది.
ఇక, సినిమాని తెలుగులోనూ బాగా ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్తీ.. సోదరుడు జూనియర్ ఎన్టీయార్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
‘దేవర’ ఓ యుద్ధం లాంటి సినిమా. నా సినిమా అలా కాదు. పక్కా స్వీట్ హోమ్ లాంటి సినిమా. మంచి ఫీల్, గుడ్నెస్ వున్న సినిమా. సినిమా మొత్తం చాలా కూల్ అండ్ కామ్‌గా సాగిపోతుంది.
నా సినిమాలో పాటలుండవ్.. ఫైట్లు అంతకన్నా వుండవ్.. అని కార్తీ చెప్పారు. ‘96’ వంటి ఓ ఫీల్ గుడ్ మూవీ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించగా, అరవింద్ స్వామి, శ్రీ దివ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..