గంజాయి వేప్ స్మగ్లింగ్..అడ్డంగా దొరికిన సోదరులు..10 ఏళ్ల జైలుశిక్ష..!!
- September 24, 2024
మనామా: కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా గంజాయితో నిండిన వ్యాప్‌లను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు సోదరులకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 36 ఏళ్ల అన్నకు 10 సంవత్సరాల శిక్ష, జరిమానాను కోర్టు విధించింది. అతడికి సహకరించిన 31 ఏళ్ల తమ్ముడికి జరిమానాతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. మొదటి క్రిమినల్ కోర్ట్ తీర్పును వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై వారు అప్పీల్ చేస్తున్నారు. హై క్రిమినల్ అప్పీల్ కోర్టులో సెప్టెంబర్ 29న ఈ కేసుపై విచారణ జరుగనుంది. కాగా, భద్రతా దళాల దర్యాప్తులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో వీరికి నెట్‌వర్క్ ఉన్నట్లు తేలింది. అనంతరం జరిపిన సోదాల్లో వారి నుంచి పెద్దమొత్తంలో గంజాయి సబంధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!