చిరంజీవికీ నాకూ మధ్య ఏమీ లేదంటోన్న కొరటాల శివ.!
- September 24, 2024
‘ఆచార్య’ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలిసి పని చేశారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. తొలిసారి తండ్రీ కొడుకు.. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.
కానీ, ఆ అంచనాల్ని తారు మారు చేస్తూ సినిమా డిజాస్టర్ లిస్టులోకి వెళ్లిపోయింది. అసలు చిరంజీవి ఈ సినిమాకి ఎలా ఒప్పుకున్నారా.? అన్న అనుమానాలొచ్చాయ్ సినిమా చూశాకా.
కానీ, డైరెక్టర్ని పూర్తిగా నమ్మాడు చిరంజీవి. కానీ, కొరటాల శివ అలా చేస్తాడనుకోలేదు. పూర్తిగా అది డైరెక్టర్ తప్పిదమే అని అప్పుడే తేల్చేశారు. ఆ సినిమా కారణంగా నష్టపోయిన నిర్మాతల్ని చిరంజీవి స్వయంగా ఆదుకున్నారు కూడా.
అయితే, తాజాగా కొరటాల శివ ఈ విషయమై మాట్లాడారు. తాజాగా ‘దేవర’ సినిమా ప్రమోషన్లలో కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కొరటాల శివ చిరంజీవినుద్దేశించి మాట్లాడారు.
చిరంజీవికీ, నాకూ మధ్య ఎలాంటి విబేధాల్లేవ్.. ఆ సినిమా రిజల్ట్ తెలిసిన వెంటనే చిరంజీవి నాతో మాట్లాడారు.. ఇప్పటికీ చిరంజీవితో టచ్‌లోనే వున్నాను.. మా మధ్య ఎలాంటి విబేధాల్లేవ్.. అన్నారు.
అంతేకాదు, ‘దేవర’కు ఆయన ఫుల్ సపోర్ట్ వుందని కొరటాల తెలిపారు. మరో రెండు రోజుల్లో ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..