దసరాకి పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ గిఫ్ట్.!
- September 24, 2024
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయ కార్యకలాపాలు మరోవైపు సినిమా పనుల్లోనూ బిజీగా వున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారాయన. ఈ సినిమా తర్వాత ‘ఓజీ’ సినిమా కోసం కూడా పని చేయనున్నారు.
వచ్చే ఏడాది మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇక, ‘ఓజీ’ విషయానికి వస్తే, దసరాకి ఓ మెస్మరైజింగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ సాంగ్‌ని తమిళ సీనియర్ హీరో శింబు పాడిన సంగతి తెలిసిందే. ఈ పాటకి సంబంధించిన రెమ్యునరేషన్ ఆయన తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం కేటాయించిన సంగతి కూడా తెలిసిందే.
ఈ పాటను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు ‘ఓజీ’ టీమ్ ద్వారా అందుతోన్న సమచారం. ఆల్రెడీ ‘ఓజీ’ నుంచి వచ్చిన గ్లింప్స్ ఏ రేంజ్లో రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక, ఈ సినిమా నుంచి రాబోయే పాట.. అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వస్తుందంటే.. దాన్ని ఏ స్థాయిలో రూపొందించి, కట్ చేసి వదలబోతున్నారో అంటూ అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..