యనిమాల్ యాప్ వ్యవస్థాపకుల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం
- September 25, 2024గ్రామీణ ప్రాంత జీవితాల్లో భాగమైన మూగ జీవాల క్రయవిక్రయాలు చేసేందుకు రైతులు ఇప్పటికీ పశువుల సంత మీదే ఆధారపడుతూ వస్తున్నారు. ఈ సంతల్లో ఒక్కప్పుడు అమ్మకాలు , కొనుగోళ్లు నమ్మకం మీద జరిగేవి. రానురాను ఈ వ్యవస్థలో కూడా దళారీల జోక్యం ఎక్కువడంతో అమ్మే వారికి, కొనేవారికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ సమయంలోనే పాడి పశువుల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం కోసం ఆన్ లైన్ వేదికగా "యానిమల్ యాప్"ను ప్రారంభించారు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన నీతూ యాదవ్ , కీర్తి జాంగ్రా.
ఢిల్లీ ఐ.ఐ.టీ పూర్వ విద్యార్థులైన నీతూ యాదవ్ , కీర్తి జాంగ్రా. ఇరువురి కుటుంబాల గ్రామీణ నేపథ్యం కారణం కూడ వీరిద్దరిని ప్రాణ స్నేహితులుగా మార్చింది . క్యాంపస్ లో ఉన్నంత కాలం వీరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చేవి. ముఖ్యంగా వ్యవసాయం, పాడి రంగాల మీద బాగా చర్చించుకునే వారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా ఈ స్నేహితురాళ్లు నిత్యం కాంటాక్ట్ లోనే ఉండేవారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూనే క్యాంపస్ రోజులు చర్చించుకున్న ప్రతి అంశం గురించి ఫోనుల్లో కూడా చర్చించుకునేవారు.
పాడి పరిశ్రమ సంఘటితంగా లేకపోవడం వల్ల రైతులు తమ సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేయలేకపోతున్నారని భావించిన వారివూరు అందుకు తామేం చేయాలో ఆలోచించారు.అనుకున్నదే తడవుగా ఇద్దరు కలిసి పల్లెలకు వెళ్లి కొన్ని వేల మంది రైతులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలేమిటో తెలుసుకున్నారు. రైతులకు ఉపయోగపడేలా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని మొదట తమ కుటుంబ సభ్యులకు చెప్పగా ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
అందుకు కారణం ఆన్ లైన్ లో ఆవుల్నీ, గేదెలని అమ్మే వీరి వ్యాపార ఆలోచన. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా వీరి బంధువులు, స్నేహితులు నిరాశపరిచారు కానీ వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా తమ మీద తమకు ఉన్న పూర్తి నమ్మకంతోనే ముందడుగు వేశారు. ఆన్ లైన్ లో పశువులు క్రయవిక్రయాలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వీరికి రావడానికి ముఖ్య కారణం.చిన్నప్పటి నుంచి ఇద్దరూ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంతల్లో జరుగుతున్న అవకతవకలు చూస్తూనే పెరిగారు.
దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల పైచిలుకు పశు సంపద ఉంది, ఇందులో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాడి రైతుల వద్ద ఉన్నాయి. భారీగా జరిగే వీటి క్రయవిక్రయాలు గురించి ఇప్పటికి ఏ భారత దేశ మార్కెటింగ్ నిపుణుడు దృష్టి సారించలేదు. ఎందుకంటే వీటి అమ్మకాలు , కొనుగోళ్లు సంప్రదాయ సంతల్లోనే జరిగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వీరు తమ వ్యాపార గమ్యం వైపు నడిచేలా చేసింది.
తమ వ్యాపారం ప్రారంభించేందుకు తమ ఐడియా పట్టుకొని పలు సంస్థల గడపలు తొక్కారు కానీ నిరాశే ఎదురయ్యింది. అయినా కూడ వెనుకకు తగ్గకుండా 2019లో భారత సిలికాన్ సిటీ గా మరియు అంకుర పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచిన బెంగుళూరు లో ఒక చిన్న అద్దె గదిలో వ్యాపార ఐడియా కు ప్రాణం పోయడం ప్రారంభించారు. తమ సన్నిహితులు దగ్గర 50 లక్షల రూపాయలు అప్పుచేసి యాప్ తయారు చేసేందుకు ఇద్దరూ సాఫ్ట్ వేర్ నిపుణులను నియమించుకున్నారు. 2019 చివర్లో “యానిమాల్” యాప్ తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేశారు.
యాప్ మార్కెట్లో విడుదలైన తర్వాత మొదట్లో ఈ ఆప్ ద్వారా కేవలం 50 పశువులను మాత్రమే అమ్మగాలిగారు. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని వీరి యాప్ కు మంచి ఆదరణ లభించింది. మొదట్లో ఇంగ్లీషులో ప్రారంభించారు కానీ తర్వాత హిందీ వెర్షన్ కూడా అభివృద్ధి చేయడంతో ఉత్తర భారతదేశంలో ఇప్పటి వరకు సుమారు 60 లక్షల మంది రైతులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.రైతులు ఆప్ ను తేలిగ్గా ఉపయోగించడానికి వీలయ్యేలా దీన్ని రూపొందిచారు.ఈ యాప్ కారణంగా ఉత్తర భారతం లో పశువుల క్రయవిక్రయాలలో ఒక పెద్ద విప్లవమే వచ్చింది.
2021 చివరి నాటికి యనిమాల్ ద్వారా ప్రతి నెల సుమారు 60 వేల పశువుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువుల్ని వెటర్నరీ డాక్టర్స్ పరీక్షించి వాటికి సెర్టిఫికెట్ ఇప్పించిన తర్వాత నే వాటిని ఆన్ లైన్లో అమ్మకానికి పెడతారు.
యానిమాల్ ఆప్ ద్వారా పాడి పరిశ్రమ రంగంలో వీరు చేస్తున్న కృషి ని గమనించిన సెకోయా మరియు మరికొన్ని వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు 160 కోట్లు పెట్టుబడులు పెట్టాయి.తమను నమ్మి అంత పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారుల నమ్మకాన్ని వమ్ము కాకుండా ఉండేందుకు మార్కెటింగ్ మీద దృష్టి సారించారు. తరచూ ప్రతి రాష్ట్రంలో చేరోపక్కకీ వెళ్లి పల్లెల్లో పర్యటిస్తూ యాప్ గురించి రైతులకు తెలియజేసేవారు. ఆప్ వాడకం మీద పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చేందుకు కొన్ని వందల రాత్రులు పల్లెల్లోనే గడిపాము అని చెబుతారు వ్యవస్థాపకులు నీతూ, కీర్తిలు.
యనిమాల్ సంస్థ కేవలం పశువుల విక్రయాలకు మాత్రమే పరిమితం కాకుండా పాడి రైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇస్తున్నారు. పశువులు కొనేందుకు రుణాలకు సంబంధించిన పలు వివరాలు తెలియజేస్తున్నారు. వీరి సహకారం, ప్రోత్సాహంతో ఉత్తర భారత దేశంలోని పలు గ్రామాల్లో రైతులు డెయిరీ ఫామ్స్ సైతం స్థాపిస్తున్నారు.
యనిమాల్ సంస్థకు నీతూ ప్రస్తుతం కార్యనిర్వాహక అధికారిగా (సీఈవో)గా, కీర్తి సంస్థ ముఖ్య కార్యకలాపాల అధికారిగా (సీవోవో)గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం యనిమాల్ ద్వారా వార్షిక లావాదేవీల విలువ మొత్తం రూ.4000 కోట్లు దాటింది. ఈ ఏడాది నికర ఆదాయం రూ.700 కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని నీతూ, కీర్తిలు చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా యనిమాల్ కార్యకలాపాలు విస్తరించేందుకు, అన్ని ప్రాంతీయ బాషల్లో యాప్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే భవిష్యత్ కార్యాచరణ తయారు చేసుకుంటున్నారు.పాడి పరిశ్రమ రంగంలో వీరు చేస్తున్న కృషిని గుర్తించిన ఫోర్బ్స్ ఇండియా ప్రతి సంవత్సరం ప్రకటించే దేశాన్ని ప్రభావితం చేసే అత్యంత ప్రభావశీలురైన 30 మంది యువ వ్యాపారవేత్తల జాబితాలో వీరికి స్థానం దక్కింది.
పాడి పరిశ్రమ రంగాన్ని మెరుపరిచేందుకు ఏ ఆధారం లేకపోయిన పాడి మీద బ్రతకవచ్చు అనే భరోసాని రైతాంగానికి కలిగించేందుకు భవిష్యత్ లో మరో శ్వేత విప్లవాన్ని తెచ్చేందుకు యనిమాల్ సంస్థ కీలకమైన పాత్ర పోషిస్తుంది విరివురూ పేర్కొన్నారు. ఇప్పటికే వీరిని స్పూర్తిగా తీసుకొని ఔత్సాహిక యువత గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా అంకురాలను స్థాపిస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్