గంటలో 3 కార్డియాక్ అరెస్టులు.. 33 ఏళ్ల ప్రవాసుడికి తప్పిన ప్రాణాపాయం..!!
- September 28, 2024
యూఏఈ: దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ (DSO)లోని ఆస్టర్ క్లినిక్‌లోని వైద్య బృందం వేగవంతమైన చొరవతో 33 ఏళ్ల ప్రవాసుడు కేవలం ఒక గంటలో మూడు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌ల నుండి అద్భుతంగా బయటపడ్డాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో తీసుకురాబడిన పేషంట్ ప్రాణాలను వైద్యులు కాపాడారు. ECG, ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్ ప్రక్రియ సమయంలో మూడు కార్డియాక్ అరెస్ట్‌లకు గురయ్యాడు. ఆలస్యం చేయకుండా క్లినిక్ యొక్క ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ERT)-వైద్యులు వెంటనే CPR చేసి డీఫిబ్రిలేటర్ షాక్‌లను అందించారు. CPR తో పల్స్ ను పునరుద్ధరించారు. ఇలా గుండె ఆగిపోయిన ప్రతిసారీ, వైద్య బృందం వేగంగా పునరుజ్జీవన ప్రయత్నాలను నిర్వహించి, విజయవంతంగా అతని ప్రాణాలను కాపాడింది
థంబే యూనివర్శిటీ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోనీ మాన్యువల్ మాట్లాడుతూ.. ముఖ్యంగా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్న యువకులు ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించాలని, క్రమం తప్పకుండా గుండె సంబంధిత పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆరోగ్య సమస్యగా కొనసాగుతున్నందున, వైద్య నిపుణులు క్రమం తప్పకుండా గుండె ఆరోగ్య పరీక్షల యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ముఖ్యంగా 40 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతి రెండు నుండి 4 సంవత్సరాలకు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని కార్డియాలజిస్టులు సిఫార్సు చేస్తున్నారు. "రోగికి ప్రీమెచ్యూర్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ లేదా హైపర్‌టెన్షన్ కుటుంబ చరిత్ర ఉంటే, వారికి 40 ఏళ్లు వచ్చేలోపు ఈ చెక్ అప్ చేయాలి" అని షార్జాలోని మెడ్‌కేర్ హాస్పిటల్ స్పెషలిస్ట్ కార్డియాలజీ డాక్టర్ మహమ్మద్ అహ్మద్ మహ్మద్ ఫాతి చెప్పారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..