త్వరలోనే మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ తో పాటు రైమ్ మైనపు బొమ్మ
- September 29, 2024
అబుదాబి: మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో వ్యాక్స్ స్టాట్యూ ఉండటం గర్వంగా భావిస్తారు. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు.మన ఇండియా నుంచి కూడా అనేక మంది ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం రాబోతుంది.
తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రామ్ చరణ్ నుంచి కొలతలు తీసుకున్నారు.అయితే రామ్ చరణ్ మాత్రమే కాకుండా చరణ్ పెంపుడు కుక్కపిల్ల రైమ్ కి కూడా కలిపి మైనపు విగ్రహం తయారుచేయబోతున్నారు మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఐఫా వేడుకల్లో ప్లే చేసారు.ఈ వీడియోలో మేడం టుస్సాడ్స్ మ్యూజియం టీమ్ చరణ్, రైమ్ ల కొలతలు, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో నా మైనపు విగ్రహం పెట్టడం గర్వంగా భావిస్తున్నాను.త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో కలుద్దాం అని అన్నారు.సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం బ్రాంచ్ లో చరణ్, రైమ్ మైనపు విగ్రహం పెట్టనున్నారు.దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే చరణ్ తో పాటు అతనితో ఎప్పుడూ ఉండే కుక్కపిల్ల రైమ్ విగ్రహం కూడా పెడుతుండటంతో ఆశ్చర్యపోతున్నారు.
Global Star @AlwaysRamCharan Wax Statue to be unveiled at #MadameTussauds Very Soon ! 🔥
— Trends RamCharan ™ (@TweetRamCharan) September 29, 2024
Announced at #IIFA2024.@MadameTussauds pic.twitter.com/bznYs3SJXL
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..