హరికేన్ బీభత్సం..44 మంది మృతి
- September 29, 2024
అమెరికా: అమెరికాలోని ఫ్లోరిడాలో హెలెనా హరికేన్ బీభత్సం సృష్టించింది.భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో 44 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాలోనూ హరికేన్ ఎఫెక్ట్ ఉన్నట్లు తెలిపారు.దీని ప్రభావంతో 20 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
గంటకు 225 కిలోమీటర్లకు పైగా వేగంతో కూడిన గాలులతో ఫ్లోరిడా సహా జార్జియా, నార్త్ కరోలినా, వర్జీనియా, దక్షిణ కరోలినాలో హెలీన్ తుపాను జలఖడ్గం విసిరింది. ఫ్లోరిడా లోని బిగ్‌బెండ్ ప్రాంతంలో ఈ హెలీన్ హరికేన్ శుక్రవారం రాత్రి తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు140 కిలోమీటర్ల వేగంత గాలులు వీయడంతో బిగ్ బెండ్ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హెలీన్ కేటగిరీ 4 హరికేన్ కాగా గతేడాది కూడా బిగ్ బెండ్ దగ్గర కేటగిరీ 3 స్టార్మ్ ఇదాలియా తీరం దాటింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..