ఖతార్ లో నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్‌ ప్రారంభం..!!

- September 29, 2024 , by Maagulf
ఖతార్ లో నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్‌ ప్రారంభం..!!

దోహా: రోగులకు హాని కలిగించే సంఘటనలను విశ్లేషించడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడానికి ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) సిద్ధమవుతోంది. జాతీయ రిపోర్టింగ్ సిస్టమ్ రోగి భద్రతా సమస్యలను తెలసుకొని మెరుగైన చికిత్సలను అందజేయడానికి డాటా ఉపయోగపడుతుందని MoPH వద్ద నేషనల్ పేషెంట్ సేఫ్టీ ప్రోగ్రాం లీడ్ డాక్టర్ షిమోస్ మొహమ్మద్ తెలిపారు.  కొత్త వ్యవస్థ జాతీయ స్థాయిలో మంత్రిత్వ శాఖకు స్థిరమైన రిపోర్టింగ్‌ను అనుమతిస్తుందని డాక్టర్ మహమ్మద్ అన్నారు.  మొదటి దశలో నేషనల్ ఇన్సిడెంట్ లెర్నింగ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆరోగ్య నిపుణుల కోసం ఉంటుందని, అయితే రాబోయే దశలో ఇది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.  రోగుల భద్రతకు సంబంధించిన అన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి ఉందని డాక్టర్ మహమ్మద్ వివరించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com