బహ్రెయిన్ లో టూరిస్ట్ రెస్టారెంట్ల మూసివేత పై కొత్త నిబంధనలు..!!
- September 30, 2024
మనామా: కొత్త నిబంధనల ప్రకారం బహ్రెయిన్ టూరిజం రెస్టారెంట్లు 3:00 AM లోపు మూసివేయాల్సి ఉంటుంది. ప్రమాణాలు, భద్రతను మెరుగుపరచడానికి కఠినమైన లైసెన్సింగ్ నియమాలను అమలు చేస్తునట్టు అధికారులు తెలిపారు. హోటళ్లు, ఇండిపెండెంట్ టూరిస్ట్ రెస్టారెంట్లలో ఆహార పానీయాల సేవలు నిర్ణీత సమయంలోపు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ అల్ సైరాఫీ సూచించారు.
కొత్త నిబంధనల ప్రకారం.. పర్యాటక సౌకర్యాలు నిర్ణీత సమయానికి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలి. ఒకటి నుండి ఆరు కేటగిరీలకు ఉదయం 2:30 నుండి ఉదయం 12:00 గంటల వరకు, ఏడు కేటగిరీలకు ఉదయం 2:30 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ప్రత్యక్ష ప్రదర్శనలను నిలిపివేయాలి. అలాగే, స్వతంత్ర పర్యాటక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నుండి లైసెన్స్ పొందాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







