యూఏఈలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!!

- September 30, 2024 , by Maagulf
యూఏఈలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..!!

యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.  ప్రధానంగా షార్జా, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా ప్రాంతాల్లో వర్షం కురిసింది. షార్జాలోని అల్ దైద్ రోడ్డుపై చిన్నపాటి వడగళ్ల వాన కురిసింది. ఈ ఉత్తర ఎమిరేట్స్‌లో జాతీయ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే రెండు మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాడీలకు దూరంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com