బయోమెట్రిక్ లేని ఖాతాలు నిలిపివేత.. ప్రారంభించిన కువైట్ బ్యాంకులు..!!

- September 30, 2024 , by Maagulf
బయోమెట్రిక్ లేని ఖాతాలు నిలిపివేత.. ప్రారంభించిన కువైట్ బ్యాంకులు..!!

కువైట్: పౌరులు బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకోవడానికి సోమవారంతో గడువు ముగిసింది. దీంతో బయోమెట్రిక్ పూర్తి చేయని వారి ఖాతాలను బ్లాక్ చేయడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. నివేదికల ప్రకారం.. నవంబర్ 1వ తేదీన వారి ఖాతాలు బ్లాక్ చేయనున్నారు.  అక్టోబర్ 1 నుండి అన్ని ఎలక్ట్రానిక్ ఛానెల్‌లు, చెల్లింపు లింక్, మనీ ట్రాన్స్‌ఫర్ మొదలైన కస్టమర్‌ల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 15 నుండి వారి బ్యాంక్ కార్డ్‌ల సేవలను నిలిచిపోనున్నాయి. నవంబర్ 1 నుండి విత్ డ్రాయర్లపై నిషేధం విధించనున్నారు.  అయితే, ప్రవాసులు బయోమెట్రిక్ పూర్తి చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com