అజ్మాన్‌లో అక్టోబర్‌ నుండి కొత్త టాక్సీ ఛార్జీలు..!!

- September 30, 2024 , by Maagulf
అజ్మాన్‌లో అక్టోబర్‌ నుండి కొత్త టాక్సీ ఛార్జీలు..!!

యూఏఈ: అక్టోబర్‌లో టాక్సీ ఛార్జీ అజ్మాన్‌లోని ప్రతి కిలోమీటరుకు Dh1.75గా నిర్ణయించారు. ఈ మేరకు  ఎమిరేట్స్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ Xలో ప్రకటించింది. ఇది సెప్టెంబర్‌లో ప్రతి కిమీకి Dh1.80 ధర ఉండగా.. తాజాగా 5 ఫిల్స్ తగ్గించారు.  కిలోమీటరుకు ఛార్జీ తగ్గడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం. అంతకుముందు, సెప్టెంబరులో ధర కిలోమీటరుకు ఆగస్టులో 1.83 దిర్హామ్‌ల నుండి 3 ఫిల్స్ తగ్గించారు.  ఇంధన ధరలు తగ్గడంతో ట్యాక్సీ ఛార్జీలను ఆ మేరకు తగ్గించారు. కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తుందని అథారిటీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ ధరలతో పోలిస్తే యూఏఈలో ఇంధన ధరలు లీటరుకు 24 ఫిల్స్ చొప్పున తగ్గాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com