స్వాగణిక వంశంలోకి స్వాగతం.! శ్రీ విష్ణు మ్యాజిక్ మొదలైందిగా.!
- September 30, 2024
విలక్షణ కథానాయకుడు శ్రీవిష్ణు ఈ మధ్య ఎంచుకుంటున్న కథలన్నీ చిత్ర విచిత్రంగా వుంటున్నాయ్. ఒకప్పుడు మంచి విషయమున్న కథలను ఎంచుకునేవాడు శ్రీ విష్ణు.
హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆయా సినిమాలు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకునేవి. కానీ, ఇప్పుడు శ్రీ విష్ణు ఎంచుకుంటున్న కథ, కథనాలు కొంత చిత్రంగా వుంటున్నాయ్.
కట్ చేస్తే.. అవి శ్రీ విష్ణుకి హిట్ టాకే తెచ్చిపెడుతున్నాయ్. కానీ, ఆ సినిమాల్లో నిజంగా చెప్పాలంటే విషయం టార్చ్‌లైట్ వేసి వెతికినా కనిపించడం లేదనడం గమనించాల్సి విషయమే.
అలాగే ‘సామజవరగమన’, ‘భూం భూమ్ భుష్’ సినిమాలు శ్రీ విష్ణుని హిట్ ట్రాక్‌లో నడిపించాయ్. అదే స్పూర్తితో ఇప్పుడు ‘స్వాగ్’ అంటూ ఇంకో సినిమాతో వస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
ఈ సినిమా స్టార్టింగ్ నుంచీ డిఫరెంట్ ప్రమోషన్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా అలాగే ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో శ్రీ విష్ణు రకరకాల గెటప్స్‌లో తనదైన టోన్ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటున్నాడు.
‘1551 కాలం నుంచి పురుషుడి ప్రయాణం..’ అంటూ స్టార్ట్ చేసిన ఈ ట్రైలర్ ఆధ్యంతం వినోదాత్మకంగా కనిపిస్తోంది. శ్రీ విష్ణుతో ‘రాజ రాజ చోర’ సినిమా తెరకెక్కించిన హస్మిత్ గోలి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడిక్ మరియు వర్త మాన కాలాల నేపథ్యంలో సినిమా కథ చిత్రంగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి, ఈ చిత్రమైన కథతో శ్రీ విష్ణు చేయబోయే కామెడీ ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







