‘సత్యం సుందరం’ సినిమా రెస్పాన్స్.! దేవర ముందర నువ్వెంత.?
- September 30, 2024
‘దేవర’ సినిమాతో పాటూ, పోటీ అనుకున్నా.. అనుకోకున్నా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది ఓ తమిళ సినిమా. అదే ‘సత్యం సుందరం’.
డబ్బింగ్ సినిమానే అయినా.. ఈ సినిమాని జనం అలా తీసుకోలేదనిపిస్తోంది. ప్రేక్షకులే కాదు, సినీ మేథావులు సైతం ఈ సినిమాని తెగ పొగిడేస్తున్నారు.
కొందరయితే, తెలుగు దర్శకులు, నిర్మాతలూ ఈ సినిమాని చూసి చాలా నేర్చుకోవాలి.. అంటూ పెద్ద పెద్ద టాలీవుడ్ డైరెక్టర్లకే సవాల్ విసురుతున్నారు.
అంతలా ఈ సినిమా టాలీవుడ్‌లో కొందరిని ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. అవును నిజమే, ఓ అందమైన జీవిత ప్రయాణం ‘సత్యం సుందరం’ సినిమా.
ఆ సినిమాకి కార్తి, అరవింద్ స్వామి నటులుగా ప్రాణం పోసేశారు. నటించారనడం కంటే, జీవించేశారు. జీవితాన్ని కళ్లముందుంచేశారు అనడం అతిశయోక్తి కాదేమో.
ఇక, ‘దేవర’ సినిమా విషయానికి వస్తే, ఎన్టీయార్ కెరీర్‌లోనే దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయ్ ఈ సినిమాకి. పెట్టిన బడ్జెట్ ఓ ఎత్తయితే.. ఈ సినిమాని హిట్ ముసుగు వేసి, బలవంతంగా ఆడిస్తున్నందుకు అయ్యే బడ్జెట్టే ఎక్కువయిపోతుందని ఇండస్ట్రీ టాక్.
చూస్తుంటే, దసరా సెలవుల్లోనూ ‘దేవర’కి పోటు తప్పేలా లేదు. ఇక, ‘సత్యం సుందరం’కి మరో కొత్త సినిమా వచ్చేంత వరకూ తిరుగే లేదు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!