బిగ్‌బాస్: హౌస్‌మేట్స్‌ని ఛీట్ చేసిన నాగార్జున.!

- September 30, 2024 , by Maagulf
బిగ్‌బాస్: హౌస్‌మేట్స్‌ని ఛీట్ చేసిన నాగార్జున.!

ఈ వారం బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో ఓ చిత్రం జరిగింది. మణికంఠ ఎలిమినేట్ అవుతాడనుకుంటే, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. నిజానికి సోనియాకి హౌస్‌లో అస్సలు పాజిటివిటీ లేదు.

ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ నుంచి తీవ్రమైన నెగిటివిటీ వున్న సంగతి షో చూస్తున్న వాళ్లందరికీ తెలిసిందే. అయితే, ఆడియన్స్ నుంచి కూడా ఆమెకు తక్కువ మెజారిటీ  ఓట్లు పడ్డాయని హోస్ట్ చెప్పారు.

అయితే, అధికారికంగా నాగార్జున మరోసారి ఈ విషయాన్ని హౌస్ మేట్స్ నుంచి కన్‌పామ్ చేసుకోవాలనుకున్నారు. సోనియా హౌస్‌లో వుండేందుకు అర్హురాలు కాదనడానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు.? అని ప్రశ్నించి.. ఈ విషయం సోనియాకి నేను చెప్పను సో, అలా ఆమెకి మీ జడ్జిమెంట్ తెలీదు.. అని మాటిచ్చాడు.

దాంతో, హౌస్‌లో నైనిక, సోనియాకి ఫేవర్ అయిన పృధ్వీ, నిఖిల్ తప్ప మిగిలిన వాళ్లంతా యునానిమస్‌గా అర్హురాలు కాదని తేల్చేశారు.

అలా సోనియా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను ఎదుర్కోలేకపోయింది. హౌస్ నుంచి బయటికి రావల్సి వచ్చింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి, స్టేజ్ మీదికొచ్చిన సోనియాకి హౌస్ మేట్స్ చేసిన నిర్వాకం చెప్పేశాడు నాగార్జున.

చెప్పనని హౌస్‌మేట్స్‌కి చెప్పి, సోనియాకి ఆ విషయం తెలిపిన నాగ్‌ని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు నెటిజనం. అసలు బిగ్‌బాస్ అంటేనే ఓ మాయ. ఆ మాయ ప్రపంచం గురించి తిట్టుకుంటూనే మాట్లాడుకోవడం ఇంకో మాయ. దటీజ్ బిగ్‌బాస్ మాయాజాలం.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com