‘తండేల్’.! నాగ చైతన్య దశ తిరిగే టైమొచ్చేసింది.!
- September 30, 2024
సాయి పల్లవి ఓ లక్కీ ఛామ్. దాదాపుగా సాయి పల్లవి నటించిన సినిమాలేమీ ఫెయిల్యూర్ అయిన సందర్భాల్లేవ్. ఇప్పుడామె ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది తెలుగులో.
అక్కినేని హీరో నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాకి తొల పోస్టర్ నుంచీ మంచి అంచనాలున్నాయ్.
దర్శకుడు చందూ మొండేటిపై నమ్మకం వుంది. మంచి విషయమున్న డైరెక్టర్. సినిమాని బాగా తీశాడని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
అవుట్ పుట్ బాగా వస్తోందని అంటున్నారు. డిశంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. డేట్ విషయంలో కాస్త అటూ ఇటూ అయ్యే అవకాశాలున్నప్పటికీ రావడం అయితే పక్కా అంటున్నారు.
ఆ సంగతి అటుంచితే, లేటెస్ట్‌గా ఆన్ సెట్స్ నుంచి రిలీజ్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
శివ పార్వతుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఓ సాంగ్‌కి సంబంధించిన స్టిల్స్ ఇవి. నాగ చైతన్య, సాయి పల్లవి నేచురల్ ట్రెడిషనల్ దుస్తుల ధరించి ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు.
ఈ పాట సినిమాకే కాదు, ప్రేక్షకుల్లో చాలా కాలం పాటు గుర్తుండిపోయే పాటవుతుందనీ, దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ అందించారనీ చిత్ర యూనిట్ చెబుతోంది. చూస్తుంటే, ఈ సినిమాకి, తాజా స్టిల్స్‌తో మంచి కళొచ్చినట్లు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







