మీ ఇంట్లో వాడే నెయ్యి శుద్ధమేనా తెలుసుకోవడమెలా.?

- September 30, 2024 , by Maagulf
మీ ఇంట్లో వాడే నెయ్యి శుద్ధమేనా తెలుసుకోవడమెలా.?

ఈ మధ్య తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి జరుగుతున్న వివాదం బహుశా అందరికీ తెలిసిందే. దేశాన్నే కుదిపేసిన అంశమిది. హిందూ సనాతన ధర్మానికి మాయని మచ్చలా తయారైన దుస్థితి.

పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలు కలిసాయని నివేదికలో తేలడంతో ఈ విషయం దేశాన్ని అతలాకుతలం చేసింది. ప్రతీ హిందువుకీ రక్తం మరిగిపోయింది.

తనవంతుగా ఈ అంశానికి సంబంధించి గొంతుక వినిపించారు. ఆ సంగతి అటుంచితే.. ఒకప్పుడు నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. మార్కెట్లో లభించే రకరకాల బ్రాండెడ్ నెయ్యిని కొనుగోలు చేసి వినియోగించుకోవల్సి వస్తోంది.

అయితే, మనం కొనే నెయ్యి ఎంత మాత్రం సేఫ్.? ఎలా గుర్తించడం.? అందుకోసం కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

స్వచ్ఛమైన నెయ్యికి మంచి సువాసన వుంటుంది. అది తెలిసిన సంగతే. అలాగే, స్వచ్ఛమైన నెయ్యి వేడి చేయగానే తొందరగా కరిగిపోతుంది. కానీ, కల్తీ నెయ్యి వేడి చేసినా అంత త్వరగా కరగదు. అలాగే వేడి చేసిన నెయ్యి ఎల్లో కలర్‌లోకి మారితే అది కల్లీ నెయ్యి కిందే భావించాలి. స్వచ్ఛమైన నెయ్యివేడి చేయగానే బ్రౌన్ రంగులోకి మారుతుంది.

కొద్దిగా నెయ్యి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి చూస్తే.. కలర్ మారకపోతే అది స్వచ్ఛమైన నెయ్యి. సాల్ట్ వేసిన చోట నీలి రంగులోకి మారితే.. ఆ నెయ్యి కల్తీ అయ్యిందని అర్ధం.

అలాగే కాచి చల్లార్చిన నెయ్యిని ఫ్రిజ్‌లో పెడితే, కాస్సేపటికి దానిపై ఓ లేయర్‌లా ఫామ్ అవుతుంది. అది కూడా కల్తీ నెయ్యిగానే భావించాలి. నీటితోనూ కల్తీ నెయ్యిని కనిపెట్టొచ్చు. ఓ గ్లాస్ నీటిలో కొన్ని చుక్కలు నెయ్యి వేసి చూస్తే.. నెయ్యి వెంటనే తేలితే అది స్వచ్చమైనదిగా గుర్తించొచ్చు.

స్వచ్ఛమైన నెయ్యిని తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవ్.  కానీ, కల్తీ నేతిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో పాటూ, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. సో, తస్మాత్ జాగ్రత్త.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com