అమెరికా వెళ్లే భారతీయులకు శుభవార్త..
- September 30, 2024
అమెరికా:అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.
పర్యటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు స్టూడెంట్స్ కు ఇవి దోహదం చేస్తాయని చెప్పుకొచ్చింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
కాగా, తాజాగా రిలీజ్ చేసిన స్లాట్‌ల వల్ల వేలాది మంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి హెల్ప్ చేస్తుందని అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అమెరికా- భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్లను యూఎస్ ఎంబసీ చేపట్టింది. ప్రస్తుతం కుటుంబీకులు, బిజినెస్, పర్యటకులపై అమెరికా దృష్టి సారించింది.
అలాగే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేయబోతున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఎన్ని జారీ చేసిందనే విషయంపై యూఎస్ ఎంబసీ క్లారిటీ ఇవ్వలేదు. 2023లో మాత్రం 1.4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కు వీసాలు ఇచ్చింది అమెరికా.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







