ట్రాఫిక్, అత్యవసర పరిస్థితుల పర్యవేక్షణ.. రస్ అల్ ఖైమా 20 స్మార్ట్ గేట్లు..!!

- October 01, 2024 , by Maagulf
ట్రాఫిక్, అత్యవసర పరిస్థితుల పర్యవేక్షణ.. రస్ అల్ ఖైమా 20 స్మార్ట్ గేట్లు..!!

యూఏఈ: ఎమిరేట్ అంతటా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి స్మార్ట్ గేట్‌లను ప్రవేశపెడుతున్నట్లు రస్ అల్ ఖైమా పోలీసులు ప్రకటించారు. ఎమిరేట్‌లోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద కృత్రిమ మేధస్సుతో నడిచే ఇరవై గేట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   

రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్ ప్రకారం.. ఈ చొరవ, విస్తృత సేఫ్ సిటీ డిజిటల్ సిస్టమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టనున్నారు. రహదారి భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే, గేట్‌లపై ఉన్న స్క్రీన్‌లు వాతావరణ అప్డ్డేట్ లు, రహదారి పరిస్థితుల గురించి డ్రైవర్‌లకు తెలియజేస్తాయి. ఇది సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణానికి దోహదపడుతుందని ఈ మేరకు 20 స్మార్ట్ గేట్ల సంస్థాపన జరుగుతోందని రస్ అల్-ఖైమా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అలీ బిన్ అల్వాన్ అల్ నుయిమి తెలిపారు. స్మార్ట్ గేట్‌లు ట్రాఫిక్ సంఘటనలను తక్షణమే నివేదించే AI- పవర్డ్ కెమెరాలను కూడా కలిగి ఉంటాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com