న్యూజెర్సీలో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- October 01, 2024
అమెరికా:రాబిన్స్‌విల్లే, న్యూ జెర్సీ: సెప్టెంబర్ 30: అమెరికాలో తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తరచుగా క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. న్యూజెర్సీలో జరిగిన ఈ వాలీబాల్ టోర్నమెంట్స్‌లో తెలుగు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పురుషులు, మహిళల రెండు విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. అడ్వాన్స్ లీగ్, ఇంటర్మీడియట్ లీగ్ పేర్లతో జరిగిన ఈ టోర్నమెంట్లలో విజేతలుగా నిలిచిన ఆర్ ఆర్ ఆర్, థండర్ స్ట్రైకర్స్, హిల్స్‌బోరో ఎవెంజర్స్, స్పైకర్స్, బ్లాకర్స్, మార్ల్బోరో విల్లీబాయ్జ్, ఎస్ఎస్ అప్సెట్టర్స్ జట్లకు, రన్నరప్ జట్లకు నాట్స్ నాయకత్వం బహుమతులు అందచేసింది. తెలుగు వాలీబాల్ ప్లేయర్స్ అంతా నాట్స్ పిలుపుకు స్పందించి ఈ టోర్నమెంట్లలో పాల్గొనడం అభినందనీయమని నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ అన్నారు. న్యూజెర్సీలో ఉండే తెలుగువారి కోసం నాట్స్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి తెలిపారు. ఆటలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయని తెలుగు వారంతా న్యూజెర్సీలో ఇలాంటి పోటీల్లో పాల్గొనడం తెలుగువారి మధ్య అనుబంధాలను, ఆత్మీయతలను పెంచేందుకు తోడ్పడతాయని నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) భీమినేని శ్రీనివాసరావు అన్నారు.
ఈ టోర్నమెంట్ల విజయవంతం కావటం లో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీనివాస్ భీమినేని సారధ్యం లో రంగరాజు చేకూరి, సుఖేష్ సబ్బాని, నీలం శ్రీనివాస్, వాసు ఏ, వీరన్న బాబు, సత్య, సారధి నారా, భార్గవి తుమ్మల, సర్వేశ్, వెంకట్ కోడూరి, కిరణ్ మందాడి తదితర వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ నుంచి నాట్స్ నాయకులు శ్రీనివాస్ మెంట, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, చక్రధర్ ఓలేటి, రమేష్ నల్లూరి, శ్రీనివాస్ కొల్లా, వెంకటేష్ కోడూరి, కృష్ణ సాగర్ రాపర్ల, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, ప్రసాద్ టేకి, వంశీ వెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల తదితరులు పాల్గొన్నారు. యూ బ్లడ్, జెఎస్డబ్ల్యూ టీవీ ఛైర్మన్ జగదీష్ యలమంచిలి, రమేశ్ రాయల, శేఖర్, సుబ్బరాజు గాదిరాజు, పవన్ దొడ్డపనేని, రామ్ గదుల, ప్రతాప్ చింతపల్లి, రవి కొల్లి, కళ్యాణ్ పొట్లూరి తదితరులు వాలీబాల్ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ టోర్నమెంట్ కు అల్పాహారం అందించిన సదరన్ స్పైస్ (నార్త్ బ్రున్స్విక్), హౌస్ అఫ్ బిర్యానీ అండ్ కబాబ్ (లారెన్సవిల్లే), బిర్యానీ పాట్ (ఈస్ట్ విండ్సర్), భీమినేని శ్రీనివాస్ ఫామిలీ, దేశీ ధమాకా వారికి శ్రీనివాస్ భీమినేని ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.
ఈ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో నాట్స్ న్యూజెర్సీ విభాగం చూపిన చొరవను, వాలంటీర్లు చేసిన కృషి నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.
టీం విజేతల వివరాలు...
ఎ లీగ్ విజేతల జట్టు పేరు: ఆర్ ఆర్ ఆర్ విజేత కెప్టెన్: త్రివేది
ఎ లీగ్ రన్నరప్ జట్టు పేరు: థండర్ స్ట్రైకర్స్
రన్నరప్ కెప్టెన్: ప్రవీణ్
గర్ల్స్ లీగ్: విజేతల జట్టు పేరు: స్పైకర్స్ విజేత
కెప్టెన్: లాస్య
గర్ల్స్-లీగ్
రన్నరప్ జట్టు పేరు: బ్లాకర్స్
రన్నరప్ కెప్టెన్: తాన్సీ
బీ-లీగ్ విజేతల జట్టు పేరు: ఎవెంజర్స్
విజేత కెప్టెన్: రాజా
బీ-లీగ్ రన్నరప్ జట్టు పేరు: మార్ల్బోరో వాలీబాయ్జ్
రన్నరప్ కెప్టెన్: విష్ణు
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..