8 దిర్హామ్‌ల వరకు 'డైనమిక్' టోల్ ఫీజులు..పుకార్లను ఖండించిన సాలిక్..!!
- October 03, 2024
యూఏఈ: ఎమిరేట్‌లోని టోల్ గేట్ల కోసం డైనమిక్ ధరలను కంపెనీ అమలు చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను దుబాయ్ టోల్ ఆపరేటర్ సలిక్ ఖండించింది. "కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న పుకార్లు సరైనవి కావు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం." అని సాలిక్ CEO ఇబ్రహీం సుల్తాన్ అల్ హద్దాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా అధికారిక ప్రకటనలు లేదా అప్డేట్ల కోసం DFM మరియు Salik వెబ్సైట్ (www.salik.ae)ని సంప్రదించాలని కంపెనీ CEO తెలిపారు. సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA), DFM నిర్దేశించిన పారదర్శకత మార్గదర్శకాలకు కట్టుబడి సలిక్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గత ఏడాది సాలిక్ టోల్ గేట్ల ద్వారా దాదాపు 593 మిలియన్ల ప్రయాణాలు సాగాయి. ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు ఎనిమిది టోల్ గేట్ల ద్వారా 238.5 మిలియన్ ట్రిప్పులు నమోదయ్యాయి. ఫలితంగా 1.1 బిలియన్ల అర్ధ-సంవత్సర ఆదాయం రాగా, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.6 శాతం ఆదాయం పెరిగిందన్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







