షార్జా విమానాశ్రయంలో 8.7 కేజీల డ్రగ్స్‌తో ట్రావెలర్ అరెస్ట్..!!
- October 03, 2024
యూఏఈ: షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో 8.716 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు షార్జా పోర్ట్స్, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్స్ అథారిటీ ప్రకటించింది. షార్జా ఎయిర్పోర్ట్ కస్టమ్స్ సెంటర్లోని కస్టమ్స్ అధికారులకు ఒక ప్రయాణికుడికి సంబంధించిన కార్డ్బోర్డ్ ప్యాకేజీలపై అనుమానం రాగా, నిశితంగా పరిశీలించిన తర్వాత, ప్యాకేజీలలో 10,934 నార్కోటిక్ టాబ్లెట్లు ఉన్నాయని, మొత్తం బరువు 8.716 కిలోలని, లైటింగ్ పరికరాలలో దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. యూఏఈకి వచ్చేటప్పుడు స్థానిక మెడిసిన్ చట్టాల గురించి తెలుసుకోవడం చాలా అవసరమని, లేదంటే తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరించారు. ప్రయాణికులు తప్పనిసరిగా తమ మందుల కోసం ప్రిస్క్రిప్షన్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







