నిధుల దుర్వినియోగం..ఫైనాన్షియల్ సంస్థకు 2.6 మిలియన్ దిర్హామ్‌ల జరిమానా..!!
- October 04, 2024
దుబాయ్: తమ విధానాలను ఉల్లంఘించినందుకు క్లయింట్ ఫండ్ దుర్వినియోగం చేసిన ఓ ఫైనాన్షియల్ సంస్థకు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ భారీ జరిమానా విధించింది. OCS ఇంటర్నేషనల్ ఫైనాన్స్ లిమిటెడ్ Dh168,800 ($46 మిలియన్) క్లయింట్ ఫండ్‌లను దుర్వినియోగం చేసిందని ఆడిట్ లో గుర్తించారు. అథారిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కంపెనీకి Dh2,645,721 ($720,905) జరిమానా విధించారు. ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు Dh682,631 ($186,000) జరిమానా విధించారు. దాంతోపాటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో లేదా దాని నుండి ఆర్థిక సేవలను అందించడానికి సంబంధించిన ఏదైనా ఫంక్షన్‌లో పాల్గొనకుండా కూడా పరిమితం చేసినట్టు DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ తెలిపారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కొనసాగించడానికి DIFCలో ఆర్థిక సేవల సమగ్రతను కాపాడుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేలా నిర్ణయాత్మక చర్యలకు వెనుకాడబోమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







