అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- October 04, 2024
యూఏఈ: అబుదాబిలో ఫాల్కన్ లను అక్రమంగా వేటాడుతూ పట్టుబడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఉత్తర ఖట్టంలోని ఎడారి ప్రాంతంలో ఈ బృందాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి ఫాల్కన్ తోపాటు కొన్ని జంతువులతోపాటు ఒక SUV ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మార్పుపై 1999 యూఏఈ ఫెడరల్ చట్టం సంఖ్య 24 ప్రకారం.. పక్షులు, అడవి, సముద్ర జంతువులను వేటాడడం, చంపడం లేదా పట్టుకోవడం నిషేధం. ప్రత్యేక అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాత మాత్రమే జంతువులను పట్టుకోవచ్చు. గత నెలలో ఫుజైరా పర్వత ప్రాంతంలో జంతువుల కోసం పెట్టిన అక్రమ ఉచ్చులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..