ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- October 05, 2024
దుబాయ్: మీరు షార్జాకు వెళుతున్నారా. అవును అయితే, వెంటనే షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్‌ను బదులుగా మరో ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిందే. ఎందుకంటే రద్దీగా ఉండే ఆ ప్రధాన రహదారిపై వాహనం బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మేరకు దుబాయ్ పోలీసులు Xలో వెల్లడించారు.ప్రమాదానికి గురైన వాహనం షార్జా వైపు వెళ్తుండగా ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా 6.9కిలోమీటర్లు దాటడానికి 4 నిమిషాల సమయం పట్టే ఈ మార్గంలో ఇప్పుడు వాహనదారులు 35 నిమిషాల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి