గోపీచంద్ అలా ఫిక్సయినట్లున్నాడు.!
- October 05, 2024
హీరో గోపీచంద్ మొదట విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రబాస్ నటించిన ‘వర్షం’ సినిమాలో, మహేష్ బాబు ‘నిజం’ సినిమాలో తనదైన పవర్ ఫుల్ విలనిజం చూపించాడు గోపీచంద్.
ఇప్పుడు మళ్లీ ఆయనను విలన్‌గా చూడాలంటూ కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం ‘విశ్వం’ సినిమాలో నటిస్తున్నారు. శీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు గోపీచంద్. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.
ఎప్పటికైనా ప్రబాస్ సినిమాలో మళ్లీ విలన్‌గా నటిస్తా.. అని ఆయన చెబుతున్నారు. ప్రబాస్, గోపీచంద్ రియల్ లైఫ్‌లో మంచి స్నేహితులు అన్న సంగతి చాలా మందికి తెలుసు.
ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఈ ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. కానీ, కథ సెట్ కావడం లేదు. అన్నీ సెట్ అయితే, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. చూడాలి మరి, ఆ టైమ్ ఎప్పటికొస్తుందో.!
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







