‘విశ్వం’తో శీను వైట్ల కమ్ బ్యాక్ అవుతాడా.?
- October 07, 2024
ఒకప్పుడు శీను వైట్ల సినిమాలంటే హాయిగా సకుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ సినిమాలు. పండక్కి.. పండగలా అనిపించే సినిమాలు. కొన్ని సక్సెస్ ఫార్ములాస్‌తో ట్రెండ్ సృష్టించాడు శీను వైట్ల.
తద్వారా ఎన్నో సూపర్ హిట్లు అదే ఫార్మేట్లో తెరకెక్కి కొంత కాలం పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయ్. కానీ, ఇప్పుడు శీను వైట్ల హవా ఏమంత లేదు. మూస కథలతో బోర్ కొట్టించేస్తున్నాడంటూ ఆయన్ని పక్కన పెట్టేశారు.
దాంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత శీను వైట్ల నుంచి వస్తున్న చిత్రమే ‘విశ్వం’. గోపీచంద్, కావ్య థాపర్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమాని టి..జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. కమర్షియల్ అంశాలతో పాటూ, ఆధ్యంతం వినోదం పంచేలా శీను వైట్ల మార్క్‌తో డిఫరెంట్ ప్యాటర్న్‌తో ఈ సినిమా వుండబోతోందనీ అంటున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయ్. గోపీచంద్‌కి ‘లౌక్యం’ తరహాలో ఓ సూపర్ హిట్ అందించే సినిమా అవుతుందని అంటున్నారు. చూడాలి మరి. అటు శీను వైట్లకీ, ఇటు గోపీచంద్‌కీ ఇద్దరికీ లక్కు తెచ్చిపెడుతుందో లేదో.!
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?