సూపర్ స్టార్ సినిమా ఎటువంటి హైప్ లేకుండానా.?

- October 07, 2024 , by Maagulf
సూపర్ స్టార్ సినిమా ఎటువంటి హైప్ లేకుండానా.?

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నుంచి ఏ సినిమా వచ్చినా రిలీజ్‌కి ముందు ఆ సినిమా సృష్టించే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఈ మధ్య సూపర్ స్టార్ సినిమాలు అలాంటి వండర్స్ క్రియేట్ చేయడం లేదు.

గత ఏడాది ‘జైలర్’ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమాకి రిలీజ్ ముందర అంచనాలు లేకపోవడంతో రిలీజ్ తర్వాత ఓకే అనిపించింది. అయితే, ధియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ‘జైలర్’ ఓటీటీలో ఒకింత బెటర్ అనిపించుకుంది.

ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమానే ‘వెట్టియాన్’. సూర్యతో ‘జైభీమ్’ వంటి సందేశాత్మక చిత్రం తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు టి.జె.జ్ఞాన్‌వేల్ ఈ సినిమాకి దర్శకుడు.

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రజనీకాంత్‌తో సహా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటులు నటించడం సినిమాకి అదనపు ఆకర్షణ.

అంతేకాదు, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి విలక్షణ నటీ నటులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అలాగే, రజనీకాంత్‌కి బాగా కలిసొచ్చిన బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మ కంగా నిర్మిస్తుండడం విశేషం. రిలీజ్‌కి ముందు పెద్దగా అంచనాలు క్రియేట్ చేయలేదు కాబట్టి, సినిమా రిలీజ్ తర్వాత ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి. అలాగే, దసరా సీజన్‌లో రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో  ఏమాత్రం మంచి టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీనే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com