పురావస్తు మసీదులు, పర్యావరణ పరిరక్షణ.. జిసిసి దేశాల మినిస్టర్స్ పిలుపు..!!
- October 07, 2024
దోహా: దోహాలో జరిగిన జిసిసి దేశాల ఇస్లామిక్ అఫైర్స్ ఎండోమెంట్స్ మంత్రుల 10వ సమావేశానికి ఖతార్ అధ్యక్షత వహించింది. ప్రారంభ సెషన్‌కు అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి హెచ్ఇ ఘనేమ్ బిన్ షాహీన్ బిన్ ఘనేమ్ అల్ ఘనీమ్ అధ్యక్షత వహించగా..జిసిసి దేశాల మంత్రులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ప్రపంచ ఎండోమెంట్స్ దినోత్సవాన్ని ప్రకటించడం, గల్ఫ్ సైంటిఫిక్ అబ్జర్వేటరీని స్థాపించడం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఎండోమెంట్స్, మసీదులు, న్యాయవాద, పరిశోధన, వికలాంగుల సంరక్షణ, కుటుంబ రక్షణ, చారిత్రక సంరక్షణ వంటి ప్రత్యేకతలను లక్ష్యంగా పెట్టుకున్నాయని అల్ ఘనీమ్ అన్నారు. పురావస్తు మసీదులు, పర్యావరణ పరిరక్షణకు సమర్థవంతమైన పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. అల్ అక్సా మసీదుపై దాడులను తీవ్రంగా ఖండించారు. మిడిల్ లిస్ట్ దేశాలలో శాంతి నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు సహకారం అందించడానికి ముందుకు రావాలని ఇజ్రాయిల్ దురాగతాలను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు