రొమాంటిక్, హారర్, బయోపిక్ జానర్స్ లో నటించాలని ఉంది: అనన్య పాండే
- October 07, 2024
‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఆమె నటించిన ‘కంట్రోల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విహాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు విక్రమాదిత్య మొత్వానే తెరకెక్కించగా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా మంచి టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది అనన్య పాండే. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలనేది నా కోరిక. నాకు రొమాంటిక్, హారర్, బయోపిక్ జానర్స్ లో నటించాలని ఉంది. అలాగే కరణ్ జోహర్ తో సినిమా చేయాలని ఉంది. అంటూ చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







