అర్వింద్‌, ఈటలకు కేంద్రంలో కీలక పదవులు!

- October 08, 2024 , by Maagulf
అర్వింద్‌, ఈటలకు కేంద్రంలో కీలక పదవులు!

హైదరాబాద్‌: కేంద్రంలో ఈటల, అర్వింద్‌కు కీలక పదవులు దక్కాయి. పార్లమెంట్‌కు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ జాయింట్‌ కమిటీ చైర్మన్‌గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ నియమితులయ్యారు.

ఈ మేరకు స్పీకర్‌ ఆమోదంతో లోక్‌సభ సచివాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సభ్యుడిగా అవకాశం దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com