నిహాన్ హిడాంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి-2024
- October 11, 2024
టోక్యో: జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అణ్వాయుధ రహితంగా ప్రపంచాన్ని మార్చేందుకు ఆ సంస్థ చేసిన ప్రయత్నాలకుగాను ఈ బహుమతి అందుకోనుంది.ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లు స్టాక్‌హోంలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ టీమ్ ప్రకటన చేసింది.
నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ.. గతంలో హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డవారిని గుర్తుచేసుకుంది. వారు పొందిన ఆ అనుభవం ద్వారా శాంతి స్థాపన కోసం ఆశను పెంపొందించారని చెప్పింది.
కాగా, గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి నర్గేస్ మొహమ్మదీకి దక్కిన విషయం తెలిసిందే. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయడం, మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఈ బహుమతి దక్కించుకున్నారు.అతి పిన్న వయసు(17 ఏళ్ల వయసులో)లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మలాలా యూసఫ్‌జాయ్ కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







