యూఏఈలో వడగళ్ళు, భారీ వర్షాలు.. పర్వత ప్రాంతాలలో అద్భుతమైన జలపాతాలు..!!
- October 11, 2024
యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలతో కూడిన వడగళ్ల వాన కురిసింది. అంతకుముందు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఫుజైరాలో భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. అంతటా అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయడం ద్వారా రహదారిపై ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు పలు వీడియోలను స్టార్మ్ సెంటర్ షేర్ చేసింది. అంతకుముందు రోజు షార్జాలోని కొన్ని ప్రాంతాలలో వడగళ్ళ వాన, రస్ అల్ ఖైమాలో భారీ వర్షాలు కురిసాయి. దీనివల్ల పర్వత ప్రాంతాలలో జలపాతాలు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. హట్టాకు వెళ్లే రహదారిపై, పర్వతాల గుండా వెళుతున్న వాహనదారులకు అద్భుతమైన జలపాతాలు స్వాగతం పలికాయి. భారతదేశ పశ్చిమ తీరానికి సమీపంలో అరేబియా సముద్రానికి దక్షిణంగా అల్పపీడనం ఏర్పడిందని, ఇది అక్టోబరు 14, 15 తేదీల్లో మధ్య అరేబియా సముద్రం వైపు దిశగా వెళ్లి బలోపేతం అవుతుందని జాతీయ వాతావరణ శాస్త్ర కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







