ఖతార్ లో GCC ఆరోగ్య మంత్రుల సమావేశాలు.. ప్రజారోగ్యంలో కీలక సంస్కరణలు..!!

- October 11, 2024 , by Maagulf
ఖతార్ లో GCC ఆరోగ్య మంత్రుల సమావేశాలు.. ప్రజారోగ్యంలో కీలక సంస్కరణలు..!!

దోహా: ఖతార్ లో GCC ఆరోగ్య మంత్రుల కమిటీ 10వ సమావేశం ప్రారంభమైంది. GCC ఆరోగ్య మంత్రుల మండలి యొక్క 87వ సమావేశానికి ప్రజారోగ్య మంత్రి HE డాక్టర్ హనన్ మహమ్మద్ అల్ కువారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యం కోసం జీసీసీ అత్యంత ప్రాధాన్యతనిస్తాయని తెలిపారు. తమ పౌరుల ఆకాంక్షలను తీర్చడానికి ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించేలా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిరంతరం బలోపేతం చేయడానికి తాము శ్రద్ధగా కృషి చేస్తున్నామని తెలిపారు. "మేము ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సవాళ్ల దృష్ట్యా, GCC స్థాయిలో మా సహకారాన్ని బలోపేతం చేయడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడానికి ఈ సమావేశం కీలకం." అని అన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (2005) అమలుతో అంటువ్యాధుల నివారణను బలోపేతం చేయడం, ఆరోగ్యంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం.. కార్యాచరణ ప్రణాళిక, శిక్షణా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యతని వివరించారు.

2022లోGCC దేశాల్లో హాస్పిటల్ బెడ్‌ల సంఖ్య 121,000 దాటగా, వైద్యుల సంఖ్య 224,000 దాటింది. కౌన్సిల్ దేశాల్లోని ఫార్మసిస్ట్‌ల సంఖ్య 69,000కు పైగా పెరిగాయి.2023లో ఇతర కౌన్సిల్ దేశాలలో ప్రభుత్వ వైద్య సేవల నుండి 400,000 కంటే ఎక్కువ మంది గల్ఫ్ పౌరులు ప్రయోజనం పొందారు. GCC దేశాల మధ్య మరింత సమన్వయం, కనెక్టివిటీని సాధించడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని GCC హెల్త్ కౌన్సిల్ HE డైరెక్టర్ జనరల్ సులేమాన్ బిన్ సలేహ్ అల్ దఖిల్ పేర్కొన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల గౌరవార్థం ప్రతి సంవత్సరం మార్చి 2వ తేదీన ఆరోగ్య అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించాలని సమావేశంలో ఆమోదించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com