భారత్-బహ్రెయిన్ బంధం బలోపేతం..పెట్టుబడుల్లో పెరుగుదల..!!
- October 11, 2024
మనామా: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ ఇండియా సొసైటీ (BIS)తో కలిసి మనామాలోని క్రౌన్ ప్లాజాలో “ద్వైపాక్షిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం” అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత రాయబారి వినోద్ కె జాకబ్ మాట్లాడుతూ.. 2024లో భారతదేశం-బహ్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని తెలియజేసారు. 2019 నుండి పెట్టుబడులలో 40 శాతం పెరుగుదల ఉందని, ప్రస్తుతం $1.62 బిలియన్లు దాటిందన్నారు. 2023 Q2 నుండి 2024 Q2 వరకు ఒక సంవత్సరం కాలంలో భారతీయ పెట్టుబడులు $265 మిలియన్లు దాటగా.. 2023 Q1 నుండి 2024 Q1 వరకు భారతీయ పెట్టుబడి $200 మిలియన్ల స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ బ్రాండ్ లకు బహ్రెయిన్ లో ఆదరణ లభిస్తుందన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు రెండు దేశాల మధ్య వ్యాపారం $1.73 బిలియన్‌లకు చేరుకుంది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







