ఆషాఢమాస బోనాల ఉత్సవాలను 22 ఆలయాల్లో...
- June 21, 2016
హైదరాబాద్ నగరం పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బోనాల షెడ్యూల్ ను విడుదల చేసింది. కమిటీ సభ్యులు ఈ యేడాది ఆషాఢమాస బోనాల ఉత్సవాలను 22 ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్వహించే కైంకర్యాలను నిర్వాహకులు తెలియజేశారు.ఇందులో భాగంగా జూలై 22న ఉదయం కలశస్థాపన, ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందన్నారు. 23న సహస్ర అక్షితార్చన, 24న ఘట స్థాపన, 25న లక్ష భిల్వార్చన, 26న పలు కార్యక్రమాలతో పాటు 27న దీపోత్సవం, తీపి వంటకాలతో అమ్మవారికి ఛప్పన్ భోగ్ నిర్వహిస్తారు. 28న లక్ష పుష్పార్చన, 29న లక్ష కుంకుమార్చన, 30న చండీహవనంతోపాటు తొట్టెల స్వాగతం, అర్ధరాత్రి పొట్టేళ్లతో ఆహార ఊరేగింపు నిర్వహించి బలిగంప పూర్తిచేస్తారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









